ఇవాళ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన భారత్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది.
జట్ల వివరాలు…
భారత్ XII : రోహిత్ శర్మ(సి), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్(w), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్ XII : బెన్ డకెట్, జాక్ క్రాలీ, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(సి), రెహాన్ అహ్మద్, బెన్ ఫోక్స్(w), జేమ్స్ ఆండర్సన్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్