నిన్న వైజాగ్ లో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జరుగుతున్న మొదటి టీ20 లో టాస్ గెలిచిన కెప్టెన్ సూర్య బౌలింగ్ ఎంచుకోవడంతో ఫ్రెష్ పిచ్ మీద అసూత్రాలైనా ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు. ఇండియా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేక ఫెయిల్ అవుతున్నారని చెప్పాలి. ఈ దశలో అసూత్రాలైనా వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మన్ జాస్ ఇంగ్లీష్ టీ 20 లలో మొదటి సెంచరీ ను సాధించి రికార్డు సృష్టించారు. వరల్డ్ కప్ లోనూ అటు కీపర్ గా మరియు బ్యాట్సమన్ గా రాణించిన ఇంగ్లీష్ ఇండియా తో మొదటి మ్యాచ్ లోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా ఫోర్లు సిక్సులతో స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు.
ఇతను 40 బంతులు ఆడి 11 ఫోర్లు మరియు 8 సిక్సులు సహాయంతో 110 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక 47 బంతుల్లోనే వీర విహారం చేసి కెరీర్ లోనే తొలి సారి అంతర్జాతీయ సెంచరీ అది కొద టీం ఇండియా పై చేసి సంచలనం సృష్టించాడు.