ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ లో భాగంగా నిన్న మరో కీలక పోరు జరిగింది. లక్నో సూపర్ జాయింట్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో 33 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై లక్నో సూపర్ జెంట్స్ విజయం సాధించింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 163 పరుగులు చేసింది.
అయితే ఆ లక్ష్యాన్ని గుజరాత్ చేదించలేకపోయింది. మొదట్లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ, తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆడ లేకపోయారు. దీంతో 18.5 ఓవర్లలో 130 పరుగులకి గుజరాత్ టైటాన్స్ చాప చుట్టేసింది. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్ యశ్ ఠాకూర్ ఏకంగా 5వికెట్లు పడగొట్టాడు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది.