Sports: మోదీ డ్రెస్సింగ్ రూమ్ కు రావడం గొప్ప విషయం: రవిశాస్త్రి

Sports: Modi coming to the dressing room is a great thing: Ravi Shastri
Sports: Modi coming to the dressing room is a great thing: Ravi Shastri

భారత్ ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో రోహిత్ తో సహా ఆటగాళ్లు అందరూ ఎమోషనల్ అయిపోయారు. ఇక డ్రెసింగ్ రూమ్ కు చేరుకున్న ఆటగాళ్లు చాలా డల్ గా పూర్తి అసంతృప్తితో ఉన్న సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి ప్లేయర్స్ కు దైర్యం చెప్పడం గొప్ప విషయం అని చెప్పాలి. ఈ విషయంపై మాజీ భారత్ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు.

అంత పెద్ద టోర్నమెంట్ లో ఫైనల్ ఓడిపోయిన తర్వాత డ్రెస్సింగ్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలియని విషయం కాదు, ఆటగాళ్లంతా నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో దేశ ప్రధాని మోదీ వారి బాధను పంచుకోవడానికి అక్కడకు రావడం చాలా పెద్ద విషయం అంటూ రవిశాస్త్రి పొగడ్తలతో ముంచెత్తారు. ఇలా చేయడం వలన ఆటగాళ్ల మనసు తేలికపడి మాములుగా అవడానికి ఒక ఛాన్స్ ఉంటుందంటూ రవిశాస్త్రి సాటి క్రికెటర్ గా వారి బాధను అర్ధం చేసుకున్నాడు.