భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మోకాలికి జరిగిన సర్జరీ విజయవంతమైంది. అతడు కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. దీంతో ఐపీఎల్ 2024కి పూర్తిగా దూరంకానున్న షమీ జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉండటం అనుమానమే. ‘‘నా మోకాలికి జరిగిన ఆపరేషన్ విజయవంతమైంది. తిరిగి మైదానంలో అడుగు పెట్టడానికి ఎదురుచూస్తున్నాను. కానీ కోలుకోవడానికి సమయం పడుతుంది’’ అని ఎక్స్ వేదికగా తెలిపాడు. వరల్డ్‌కప్ 7 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టి జట్టు ఫైనల్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించిన షమి చివరగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆడాడు. అనంతరం గాయంబారిన పడి చికిత్స కోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. ఆ తర్వాత పూర్తిగా జట్టుకు దూరమై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్, దక్షిణాఫ్రికా టూర్, ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రాలేదు.
ఐపీఎల్లో గుజరాత్ జట్టు పేస్ బౌలింగ్‌కు నాయకత్వ విధుల్లో ఉన్న షమీ 2024 సీజన్‌కు దూరమవడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ . 2022 సీజన్లో గుజరాత్ తరఫున 20 వికెట్లు పడగొట్టి విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2023 సీజన్లోనూ 28 వికెట్లు సాధించాడు.