మహిళల ప్రిమియర్ లీగ్ సీజన్-2లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ బోణీ కొట్టింది. శుక్రవారం ఉత్కం ఠభరితం గా సాగిన తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో దిల్లీ క్యా పిటల్స్ ను ఓడించింది. మొదట దిల్లీ 171 స్కో రు చేసింది. అలీస్ క్యాప్సీ 75 టాప్ స్కోరర్. లక్ష్యాన్ని ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యాస్తిక భాటియా 57, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 55 విజయంలో కీలకపాత్ర పోషించారు. మొదట నాట్ సీవర్ (19).. తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తోడుగా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లింది. అర్ధసెంచరీతో తర్వాత యాస్తిక ఔటైనా.. హర్మన్‌ప్రీత్, అమేలియా (24)తో కలిసి ఎదురుదాడి చేసి ముంబయిలో ఆశలు రేపింది.
కానీ అమేలియా పెవిలియన్ చేరడంతో ముంబయికి ఎదురుదెబ్బ తగిలింది. ఆఖరి ఓవర్లో ముంబయి గెలవాలంటే చివరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. సజన (6 నాటౌట్) సిక్స్ బాదేసి దిల్లీకి షాక్ ఇచ్చింది. మొదట దిల్లీ 3 పరుగులకే షెషాలీవర్మ (1) వికెట్ కోల్పోయినా.. జెమీమా(42), లానింగ్ (31)తో కలిసి అలీస్ క్యాప్సీ జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టింది. మ్యాచ్‌కు ముందు లీగ్ ఆరంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్ ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకున్నాయి.