Sports: IPL 2024లో సూర్య వీర విహారం.. RCB పై ముంబై ఘన విజయం..

Sports: Surya Veera Viharam in IPL 2024.. Mumbai's big win over RCB..
Sports: Surya Veera Viharam in IPL 2024.. Mumbai's big win over RCB..

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మరో ఓటమి చవిచూసింది. నిన్న ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 7 వికెట్లు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.

డూప్లిసిస్, దినేష్ కార్తీక్ అద్భుతంగా ఆడటంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. RCB అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ మొదటి నుంచి దూకుడుగా ఆడింది. 15.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది. సూర్య కుమార్ యాదవ్ 19 బంతుల్లో 52 పరుగులు చేసి చుక్కలు చూపించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 69 పరుగులు రోహిత్ శర్మ 38 పరుగులు చేసి ఆదుకున్నారు. ఇక ఇందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్ర కు వచ్చింది.