Sports: IPL 2024లో ఇవాళ లక్నో, ఢిల్లీ జట్ల మధ్య కీలక పోరు.. ఇవిగో జట్ల వివరాలు

Sports: Today in IPL 2024, Lucknow and Delhi will play a crucial match. Here are the details of the teams.
Sports: Today in IPL 2024, Lucknow and Delhi will play a crucial match. Here are the details of the teams.

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా మ్యాచులన్నీ రసవంతరంగా కొనసాగుతున్నాయి. గురువారం రోజున బెంగళూరు, ముంబై మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక ఇవాళ 26వ మ్యాచ్ జరగనుంది. ఇందులో లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. లక్నోలోని అటల్ బీహార్ వాజ్పేయి స్టేడియంలో ఈ మ్యాచ్ ఉండనుంది.

ఎప్పటిలాగే ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే లక్నో వరుస విజయాలతో దూసుకు వెళ్తోంది. అటు ఢిల్లీ మాత్రం పాయింట్స్ టేబుల్ లో చివరన ఉండిపోయింది. ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. కేవలం CSK జట్టు పైన విజయం సాధించింది ఢిల్లీ. ఇకపై ఢిల్లీ క్యాపిటల్స్ కచ్చితంగా ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. మరి ఇవాళ మ్యాచ్ గెలుస్తుందో లేదో చూడాలి.