Sports: మగబిడ్డకు జన్మనిచ్చిన విరాట్-అనుష్క దంపతులు

Sports: Virat-Anushka gave birth to a baby boy
Sports: Virat-Anushka gave birth to a baby boy

నటి అనుష్క శర్మ, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15న తమ రెండవ సంతానం అకాయ్ అనే మగబిడ్డ పురుడు పోసుకున్నట్లు అనుష్కశర్మ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వార్త తెలియగానే వీరిద్దరికీ సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విషయాన్ని స్వయంగా అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన కుమారుడి పేరును కూడా పోస్ట్‌లో వెల్లడించింది. గత కొన్ని నెలలుగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వార్తల్లో నిలుస్తున్నారు. అనుష్క రెండోసారి గర్భం దాల్చిందని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాన్ని ఇద్దరూ ధృవీకరించలేదు. కొంతకాలం క్రితం, దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరి రహస్యాన్ని వెల్లడించాడు. ప్రెగ్నెన్సీ పుకార్లలో నిజంగా నిజం ఉందని అప్పుడు నమ్మారు. అయితే, ఆ తర్వాత ఏబీడీ ఈ వార్త నిజం కాదంటూ ప్రకటించడంతో అందరూ అయోమయంలో పడ్డారు.