ఏ విద్యాసంస్థ అయినా తమ విద్యార్ధులని విద్య ద్వారా మెరికల్లాగా తయారుచేసి తద్వారా ర్యాంకులు సాదిద్దాం అనుకుంటుంది. కానీ మిగతా విద్యా సంస్థలకి భిన్నంగా ఉండే చైతన్య మాత్రం మంచి ర్యాంకులు వచ్చిన వారి పేరు తమ హార్డింగ్లలో వేసేసి ఇదేంటని ప్రశ్నించిన వారిని నయానో భయానో మేనేజ్ చేసేస్తుంది. గత ఏడాది ఐఐటి జేఈఈ అడ్వాన్స్ ఆల్ ఇండియా లెవెల్లో మొదటి ర్యాంక్ సాధించిన సర్వేష్ ని తమ విద్యార్ధి అని పేర్కొంటూ మీడియాలో యాడ్ లు ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే సాలు సర్వేశ్ చదివింది మాత్రం చండీగడ్ లోని లక్ష్య ఇన్స్టిట్యూట్ లో.
అసలు గతేడాది జరిగిన విషయం ఏంటంటే సర్వేష్ కి ర్యాంక్ వచ్చిన వెంటనే అది తమ ఘనతగా చెప్పుకుంటూ నలుగురు అధ్యాపకులు లక్ష్య కాలేజ్ నుండి శ్రీ చైతన్య లోకి మారారు. వెంటనే సర్వేష్ తమ విధ్యార్దే అంటూ చైతన్య పబ్లిసిటీ మొదలెట్టింది. అయితే ఇలా తమ విద్యార్ధి పేరు చైతన్య వాడుకోవడం మీద లక్ష్య ఇన్స్టిట్యూట్ వారు కోర్టు కేసు కూడా వేశారు. ఏమయిందో తెలియదు కానీ తర్వాత ఆ విషయం మరుగున పడిపోయింది. అయితే ఆ పరిణామంతో అయినా శ్రీ చైతన్య పద్దతి మార్చుకుంటుందేమో అనుకుంటే ఈ ఏడాది కూడా అదే లక్ష్య ఇన్స్టిట్యూట్ కి చెందిన ఆలిండియా నాలుగవ ర్యాంకు విద్యార్ధి ప్రణవ్ గోయెల్ ని కూడా తమ విద్యార్ధిగా పేర్కొంటూ యాడ్ క్యాంపెయిన్ మొదలెట్టింది.
కుక్క తోక వంకర వంకరే అన్నట్టు మరో సారి తన బుద్దిని బయట పెట్టుకుంది శ్రీ చైతన్య. గతేడాది శ్రీ చైతన్య మొదటి ర్యాంకర్ తమ విధ్యార్దే అని చెప్పుకున్నా ఆ మొదటి ర్యాంకర్ సర్వేష్ మాత్రం తాను చదివిన లక్ష్య కాలేజ్ విద్యార్ధులని ఉత్తేజపరిచాడు. లక్ష్య ఇన్స్టిట్యుట్ తో పాటు దానికి అనుభందంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీ గాయత్రి విద్యా సంస్థలలో కూడా పర్యటించి విద్యార్ధులని ఉత్తేజ పరిచాడు. ఈ విషయాలని ప్రజలు గమనిస్తుంటారనే ధ్యాసే లేకుండా ఈ ఏడాది కూడా మరో విద్యార్ధి పేరును వాడుకోవడం శ్రీ చైతన్యకే చెల్లింది.