శ్రీకాంత్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్….బయటకొచ్చిన ఆడియో టేప్

చిట్టిపాక శ్రీకాంత్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తన భార్య తరపు వారు తన భార్యకు అబార్షన్ చేయించారని తన భార్య కూడా మోసం చేసింది అని ఆరోపిస్తూ ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన అతను చనిపోయిన విషయం తెలిసిందే.పోలీసుల వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం ఓగోడుకు చెందిన చిట్టపాక ముత్తయ్య, సుజాత దంపతులు హైదరాబాద్‌కు వలస వచ్చారు. వారి కుమారుడు శ్రీకాంత్‌ (26) హైదరాబాద్‌లో బీఫార్మసీ చదువుతున్న రోజుల్లో సహ విద్యార్థిని శ్రీహర్షను ప్రేమించాడు. 2015లో పెద్దలను ఎదిరించి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. కొంతకాలం కలిసి ఉన్నారు. శ్రీహర్షకు వైద్యవిద్యలో సీటు రావడంతో 2017లో మహబూబ్‌నగర్‌ వైద్య కళాశాలలో చదివేందుకు వెళ్లింది.

sri harsha and srikanth marriage
బీఫార్మసీ మధ్యలో ఆపేసిన శ్రీకాంత్‌ తరచూ శ్రీహర్ష ఉండే హాస్టల్‌ వద్దకు వెళ్లేవాడు. అక్కడ భార్య స్నేహితురాలితో పరిచయం పెంచుకొని ఆమెకు అశ్లీల సందేశాలు పంపాడు. బాధితురాలి ఫిర్యాదుతో మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీసులు శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. దీంతో కలత చెందిన శ్రీహర్ష అతనితో సంబంధం తెంచుకుని తల్లిదండ్రులతో ఉంటోంది. తర్వాత శ్రీకాంత్‌ ప్రవర్తన మితిమీరడంతో పలుమార్లు నకిరేకల్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ ఠాణాలో శ్రీకాంత్‌పై అయిదు కేసులు నమోదయ్యాయి. వీరి విడాకుల కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. బుధవారం కూడా శ్రీకాంత్‌ అనుచితంగా ప్రవర్తించాడంటూ శ్రీహర్ష పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం శ్రీ హర్ష ఒక ఆడియో టేప్ విడుదల చేసింది. ఆ ఆడియో టేప్ మీరూ వినండి.