Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రతిపక్ష నేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేస్తూ బిజీ గా ఉన్నాడు. ఇక నారా లోకేష్ విషయానికొస్తే ఐటీ మరియు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖల భాద్యతలను నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ ప్రతిపక్ష, అధికార పార్టీలకు చెందినవారన్న అందరికి విదితమే. ఒకరకంగా చూస్తే ఇద్దరి మధ్యా రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కానీ ఇప్పుడు టాలీవుడ్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నటి శ్రీరెడ్డి మాత్రం ఇద్దరికీ మద్దతు తెలుపుతూ తాను ఎవరికి స్పష్టమైన మద్దతును తెలుపుతుందన్న విషయం క్లారిటీ ఇవ్వక ఇద్దరి అభిమానులని టెన్షన్లో పెట్టేసింది.
ఫేస్ బుక్ వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటూ తరచూ పోస్టులు చేసే ఆమె ఒకసారి జగన్ పై సానుభూతి వాఖ్యలు చేస్తే ఇంకోదాంట్లో లోకేష్ కు సపోర్ట్ చేస్తుంది. జగన్ అన్నా… రౌడీ రాజకీయాలు చేసేవాళ్ళని కలుపుకోవద్దు. ఓర్పు, శాంతి జగన్ ఆయుధాలు అంటూ జగన్ కు సలహాలు ఇచ్చిన ఆమె తాజాగా జగన్ కు తేనెటీగలు కుట్టిన నేపథ్యంలో జగన్ గారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా, దేవుడి కృప ఆయనపై ఉండాలి అంటూ జగన్ పై ఏనాలేని ప్రేమ కురిపించింది.
ఇక మరోపక్క మంత్రి లోకేష్ కు కూడా ఆమె మద్దతుగా పోస్ట్లు పెడుతోంది. నారాలోకేష్ పై ఎవరైనా కామెంట్లు చేస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చింది. అంతేగాక లోకేష్ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మొదలుపెడితే తాను వెనకనడుస్తా అంటూ చెప్పింది. ఇలా రెండు రకాల షేడ్స్ చూపిస్తూ ఉండడంతో ఆమె వైసీపీ మద్దతుదారా లేక టీడీపీ సానుభూతిరాలా అన్న విషయం నెటిజన్ లకి అర్దహం కావడంలేదు. ఈ అంశం మీద విశ్లేషకులు పలు భిన్న విశ్లేషణలు అందిస్తున్నారు ఆమె ఎవరి మద్దతురాలు కాదని, ఎందుకంటే వీరిపై చేసిన ప్రతి పోస్టులో ఆమె పవన్ ని చేర్చి విమర్సిస్తుంది కాబట్టి అది పవన్ మీద కోపమే తప్ప జగన్ లోకేష్ ల మీద ప్రేమ కాదని అంటున్నారు. అలాగే రెండు పార్టీలకి చెందిన ప్రధాన నేతలను వెనకేసుకు వస్తే వారి వారి అభిమానుల సపోర్ట్ తనకు ఉంటుందని భావించి కూడా ఇలా చేస్తూ ఉండచ్చు అని వారు వాదిస్తున్నారు.