Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అతిలోక సుందరి శ్రీదేవి దుబాయిలో హఠాత్తుగా హార్ట్ఎటాక్తో మృతి చెందడంతో ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆమె పార్ధీవ దేహం కోసం అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె గుండె పోటుతో మరణించారని, బాత్రూంలో ఉన్న సమయంలో శ్రీదేవికి గుండెపోటు రావడంతో మృతి చెందిందంటూ కపూర్ ఫ్యామిలీ మొదటి నుండి చెబుతూ వస్తుంది. శ్రీదేవి బాత్ రూం నుండి ఎంత సమయం అయినా రాకపోవడంతో మొదట బోణీ కపూర్ ఆమె బాత్రూంలో కుప్పకూలినట్లుగా గుర్తించారు అంటూ ఫస్ట్ రిపోర్ట్‌లో వచ్చింది. కాని తాజాగా మాత్రం శ్రీదేవి మరణంపై కొత్త కథనాలు వినిపిస్తున్నాయి.
శ్రీదేవి చనిపోయిన సమయంలో బోణీ కపూర్ ఇండియాలో ఉన్నాడని, ఆయన మొదట శ్రీదేవి డెడ్ బాడీని గుర్తించినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని కొందరు అంటున్నారు. శ్రీదేవిది సహజ మరణం కాదని, అందుకే దుబాయి అధికారులు పోస్ట్ మార్టంకు ఎక్కువ సమయం తీసుకున్నట్లుగా కొందరు చెబుతున్నారు. శ్రీదేవి మరణం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పలు ప్రశ్నలకు కపూర్ ఫ్యామిలీ సమాధానం చెప్పాల్సి ఉంది.
శ్రీదేవి చనిపోయినప్పుడు బోణీకపూర్ ఇండియాలో ఉన్నట్లుగా వస్తున్న వార్తపై కపూర్ ఫ్యామిలీ స్పందన ఏంటీ? శ్రీదేవి మృత దేహంకు దుబాయి అధికారులు ఎందుకు అంత సమయం పోర్ట్ మార్టం చేయాల్సి వచ్చింది, శ్రీదేవి చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఏం జరిగింది అనే ప్రశ్నలకు కపూర్ ఫ్యామిలీ సమాధానం చెప్పాల్సిందిగా ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీదేవి మరణం సహజంగా జరిగింది కాదని, ఏదో రహస్యంను దాస్తున్నట్లుగా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి మరణం మిస్టరీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉంది.