Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
1980వ దశకంలో, 90 వ దశకం ప్రధమార్థంలో హీరోయిన్ అన్న పదానికి, అందం అన్న పదానికి అతిలోక సుందరి శ్రీదేవే అసలు సిసలు నిర్వచనం. తెలుగు, తమిళ, హిందీ…ఇలా భాషతో పనిలేకుండా ఆల్ ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ ఆమె. శ్రీదేవి అందం గురించి వర్ణించటానికి మాటలు చాలవనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలతో చేసిన సినిమాల్లో శ్రీదేవి అందం నిజంగా చూపు తిప్పుకోనివ్వకుండా ఉండేది. శ్రీదేవి వీరాభిమాని రామ్ గోపాల్ వర్మ తీసిన గోవిందా గోవిందా సినిమాలో ఓ పాటలో వర్ణించినట్టుగా పూలరెక్కలు, కొన్ని తేనెచుక్కలు రంగరించి తయారుచేశారా అన్నట్టుగా శ్రీదేవి ఉండేది. ఆ పాటలోనే చెప్పినట్టు భూలోకం నిజంగానే శ్రీదేవిలాంటి అందెగత్తెను చూసి ఉండదు. బాలీవుడ్ కు వెళ్లిపోయిన తర్వాత ఆమె అందం మరింత పెరిగింది. ఓ పక్క బాలీవుడ్ లో సంచలనాలు సృష్టిస్తూనే తెలుగులో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరిలో పోషించిన క్యారెక్టర్ కు తగ్గట్టుగానే నిజంగానే దేవకన్యను తలపించింది. ఆ తర్వాత 1997లో పెళ్లిచేసుకుని సినిమాలకు దూరమైంది శ్రీదేవి.
ఇద్దరు పిల్లలకు తల్లయిన తర్వాత కూడా ఆమె అందం కొన్నేళ్లవరకు ఏ మాత్రం చెక్కుచెదరలేదు. కానీ కొన్నేళ్లగా ఆమె రూపం విచిత్రంగా మారిపోయింది. వయసు పెరిగిన తర్వాత ఎవరికయినా రూపం మారడం సహజం. యవ్వనంలో ఉన్నంత అందం 40లు, 50ల్లో ఉండదు. అయితే ఆ వయసు మహిళలకు హుందాతనంతో కూడిన అందం ఉంటుంది. శరీర స్వభావ రీత్యా ముఖంలో ముడుతలు వచ్చినా..లేదా లావయినా…వయసుకు తగ్గట్టే కనిపిస్తారు. అయితే హీరోయిన్లు మాత్రం వయసు కనపడకుండా ఉండేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. పాతతరం హీరోయిన్లు హేమమాలిని, రేఖ వంటివారు కూడా కొన్ని శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. కానీ చికిత్సల వల్ల వారి రూపంలో పెద్దగా మార్పులేమీ రాలేదు. వయసుకు తగిన అందంతో కనిపిస్తున్నారు. కానీ శ్రీదేవి పరిస్థితి ఇందుకు భిన్నం. ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంతో బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి రూపం చాలా మారిపోయింది. ఆమె వయసుకు తగ్గట్టుగా హుందా అయిన అందం శ్రీదేవిలో కనిపించలేదు. దాదాపు 50 ఏళ్ల వయసులో 2012లో ఇంగ్లిష్ వింగ్లిష్ లో నటించిన శ్రీదేవి 30 ఏళ్ల యువతిగా కనిపించేందుకు తాపత్రయపడినట్టు ఆమె రూపం చూస్తే అర్ధమవుతుంది. నిజానికి ఆ వయసులో మహిళలు కొంచెం లావుగా ఉంటనే బాగుంటారు. కానీ శ్రీదేవి మాత్రం హీరోయిన్ గా ఉన్నప్పటి కన్నా సన్నగా…ఆ సినిమాలో కనపడింది.
అయితే ఆ వయసులోనూ ఆ ఫిజిక్ మెయింటెన్ చేయడంపై అందరూ శ్రీదేవిని ప్రశంసించారు. అందంగా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కూడా వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలను శ్రీదేవి ఖండించింది. తాను ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటానని, పవర్ యోగా చేస్తానని, వారంలో నాలుగురోజులు టెన్నిస్ ఆడతానని, వాటన్నింటి వల్లే శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని ఆమె చెప్పింది. కానీ ఎక్కువమంది ఆమె ప్లాస్టిక్ సర్జనీ చేయించుకుందనే భావించారు. తాజాగా ఇప్పుడు మరోసారి కూడా శ్రీదేవి గురించి అలాంటి చర్చే జరుగుతోంది. వసంత పంచమి సందర్భంగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు ఇంట్లో సరస్వతి పూజ నిర్వహించారు. ఈ పూజకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. శ్రీదేవి కూడా ఆ పూజకు వచ్చింది. అనురాగ్ ఇంటిముందు కారు నుంచి దిగిన శ్రీదేవిని చూసి మీడియా షాక్ తింది. ఆమె మూతి, మొహం ఉబ్బిపోయి ఎప్పుడూ చూడని విధంగా మారిపోయింది. సరిగ్గా చెప్పాలంటే ఆమె మైఖేల్ జాక్సన్ లా కనిపిస్తోంది. దీంతో ఆమె మరోసారి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు బాలీవుడ్ మీడియా అంటోంది. మూతి అలా ఎందుకయింది? అని మీడియా ప్రశ్నించినా…ఆమె సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయింది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూసి శ్రీదేవి అభిమానులు షాక్ తింటున్నారు. ఒకప్పటి తమ ఆరాధ్య దేవత ఇలా అయిపోయిందేమిటి అని దిగాలు పడుతున్నారు.
@sridevi.kapoor #SrideviKapoor #Sridevi #SrideviTheLastEmpressOfBollywood #QueenOfBollywood #HawaHawai #EternalDiva #EvergreenBeauty #ScreenGoddess #RoopKiRani #PowerhousePerformer #Mom #AthilokaSundari #BeautyQueen