Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా కాలు మోపి దశాబ్ద కాలం దాటింది. ఈ దశాబ్ద కాలంలో ఈ దర్శకుడు కేవలం మూడు అంటే కేవలం మూడు సినిమాలను మాత్రమే చేశాడు. ఈ మూడు సినిమాల్లో రెండు పర్వాలేదు అన్నట్లుగా ఉండగా ఒకటి మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సంవత్సరంలో అతి పెద్ద డిజాస్టర్‌గా ఈయన తీసిన ‘బ్రహ్మోత్సవం’ నిలిచింది. మహేష్‌బాబుతో 2016లో బ్రహ్మోత్సవం తీసిన తర్వాత కనుమరుగు అయిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మళ్లీ ఇన్నాళ్లకు తన తదుపరి సినిమాకు సంబంధించిన వార్తతో మీడియా ముందుకు వచ్చాడు.
పలు కథలు సిద్దం చేసుకుని, ఎంతో హీరోల చుట్టు తిరిగిన తర్వాత ఎట్టకేలకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించేందుకు శర్వానంద్ ఓకే చెప్పాడు. విభిన్న చిత్రాలు చేయడానికి ఎప్పుడు సిద్దంగా ఉండే శర్వానంద్ తాజాగా శ్రీకాంత్ అడ్డాల చెప్పిన ఒక ఫ్యామిలీ కథాంశంకు ఫిదా అయ్యాడు. వెంటనే ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు. కథల ఎంపిక విషయంలో శర్వానంద్ మంచి ప్రతిభ కనబర్చుతాడు. అందుకే శ్రీకాంత్ అడ్డాలకు శర్వానంద్ ఓకే చెప్పాడు అంటే ఖచ్చితంగా మంచి కథ అయ్యి ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న సినిమాతో పాటు కమిట్ అయిన సినిమాను కూడా పూర్తి చేసి ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించబోతున్నాడు. వచ్చే సంవత్సరం చివర్లో వీరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో అయినా శ్రీకాంత్ అడ్డాల సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.