ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇందులో స్టార్ హీరో, హీరోయిన్‌లు కూడా నటించేందుకు సన్నద్ధమవుతున్నారు. రీసెంట్‌గా సమంత కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. కట్ చేస్తే మోహన్ బాబు ఇన్నాళ్ళు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బేనర్‌పై మంచి చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయుడు విష్ణు చదరంగం పేరుతో ఓ వెబ్ సిరీస్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మోహన్ బాబు శ్రీకాంత్‌పై తొలి క్లాప్ ఇవ్వగా, మరి కొద్ది రోజులలో ఈ సిరీస్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు సమాచారం. ఇందులో మంచి నటీ నటులు ఉంటారని విష్ణు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నేళ్ళుగా జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందుతుందని ఆయన పేర్కొన్నాడు. ఈ సిరీస్ కొంతమంది ప్రజలకి షాక్ ఇస్తుందని విష్ణు తన ట్వీట్‌లో పేర్కొనడం కొసమెరుపుగా చెప్పవచ్చు. ఈ వెబ్ సిరీస్‌ని జీ5 యాప్‌లో వీక్షించవచ్చు.