Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని సినిమాల్లో హీరోలు కనిపించరు, కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ కనిపించరు, కొన్ని సినిమాల్లో విన్స్ లేదా కమెడియన్స్ కనిపించరు. కాని అన్ని సినిమాలకు కూడా దర్శకుడు మాత్రం తప్పనిసరిగా ఉంటాడు. ఎలాంటి సినిమా అయినా దర్శకుడు అనే వాడు ఉండాల్సిందే. కాని శ్రీకాంత్ తాజాగా నటించిన ‘రారా’ చిత్రానికి మాత్రం దర్శకుడు లేడు. మొదట ఈ చిత్రాన్ని ఒక దర్శకుడు మొదలు పెట్టాడు. అయితే నిర్మాతకు దర్శకుడికి విభేదాలు రావడంతో ఆయన సగం కూడా తెరకెక్కించకుండా వెళ్లి పోయాడు. దాంతో సినిమాను కొంత కాలం ఆపేశారు. శ్రీకాంత్ ఇద్దరి మద్య సయోద్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేశాడట, కాని సఫలం కాలేదు.
దాదాపు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ‘రారా’ సినిమాను పూర్తి చేసి విడుదల చేయబోతున్నారు. ‘రారా’ సినిమాను మరో దర్శకుడితో పూర్తి చేయించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కాని సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీకాంత్ మరియు నిర్మాత కలిసి సినిమాను పూర్తి చేశారని, వారిద్దరి పేర్లు వేసుకుంటే బాగుండదనే ఉద్దేశ్యంతో ఒక దర్శకుడు ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు అని, ఆయన తన పేరును వేసుకునేందుకు ఇష్టపడక పోవడం వల్లే ఆయన పేరు వేయడం లేదు అంటూ తాజాగా శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి టాలీవుడ్లో దర్శకుడు అనే టైటిల్ కార్డు లేకుండా రాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.