అబ్బో… వైట్ల పెద్ద ప్రయోగమే

Srinu Vaitla makes a movie with Ravi Teja with Triple role

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘దూకుడు’ చిత్రం తర్వాత టాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడిగా మారిన శ్రీనువైట్ల అప్పటి నుండి వరుసగా ఫ్లాప్‌ల మీద ఫ్లాప్‌లు చవి చూస్తూనే ఉన్నాడు. నాలుగు వరుస ఫ్లాప్‌లు రావడంతో శ్రీనువైట్లకు ఇక ఛాన్స్‌లు రావడమే కష్టం అని అంతా భావించారు. కాని రవితేజ విశ్వాసంతో శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. రవితేజ తనపై పెట్టుకున్న నమ్మకంను వమ్ము చేయకుండా, ఒక మంచి సినిమాను చేసి తన సత్తాను చాటాలనే పట్టుదలతో శ్రీనువైట్ల ఉన్నాడు. దాదాపు ఆరు నెలల పాటు కఠినంగా శ్రమించి ఒక స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు. పలువురు రచయితలు మరియు దర్శకులతో ఈ స్క్రిప్ట్‌పై చర్చలు జరిపి చివరకు సిద్దం చేసిన శ్రీనువైట్ల త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ‘జైలవకుశ’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ చిత్రంలో మూడు పాత్రలు చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. అందుకే ఇప్పుడు రవితేజ మూడు పాత్రలు అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. ఒక్క దర్శకుడు మూడు పాత్రలను బ్యాలన్స్‌ చేస్తూ సినిమాను చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి ఫ్లాప్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీనువైట్ల ఏకంగా మూడు పాత్రల్లో రవితేజను చూపించనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. సినీ వర్గాల వారు ఈ చిత్రాన్ని పెద్ద ప్రయోగం అంటున్నారు. రవితేజ కెరీర్‌లో ఇదో విభిన్న చిత్రంగా నిలుస్తుందని మాత్రం అంతా అంటున్నారు. అయితే సినిమా సక్సెస్‌ అవుతుందా ఫ్లాప్‌ అవుతుందా అనే విషయంపై మాత్రం భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి.