టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం తర్వాత చాలా విరామం తీసుకుని ఒక మల్టీస్టారర్‌ను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. 300కోట్ల బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనుండగా స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఈ చిత్రంలో నటించనున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.
కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని 2020కల్లా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ఇప్పటి నుండే ప్లాన్ చేస్తోంది. ఎన్టీఆర్, చెర్రీల దగ్గర ఇప్పటికే బల్క్ డేట్స్‌ను బుక్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 11న ఉదయం 11గంటల 11నిమిషాలకు ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేయనున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఈ ముహర్తం చూడడానికి చాలా ఫ్యాన్సీగా ఉంది కానీ గతంలో ఇదే రోజున విడుదలయిన సినిమాలు డిజాస్టర్‌లుగా మిగిలిపోయాయి.
ఇదే రోజున గతంలో సిద్దార్థ్ హీరోగా నటించిన ‘ఓ మై ఫ్రెండ్’ 2011లో, అఖిల్ నటించిన ‘అఖిల్’ 2015, నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ 2016లో విడుదలయి కోలుకోలేని విధంగా నష్టాలను మిగిల్చాయి. దాంతో ఇదే రోజున జక్కన్న ఆర్ మల్టీస్టారర్‌ను లాంచ్ చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో అని ఊహించుకోవడానికే భయంగా ఉంది అని అభిమానులు వాపోతున్నారు. అయితే అందరి విషయంలో అలా జరగదులేండి. కానీ ఎందుకైనా మంచిది అన్ని చూసుకుని ఉండాల్సింది. అయితే ఈ సెంటిమెంట్ పట్ల రాజమౌళి ఆలోచన ఏంటి? తనకు చేదు అనుభవం లేదు కాబట్టి ఈ సెంటిమెంట్ ఫాలో అవుతాడా? లేక ఆలోచిస్తాడా.