కన్నడ డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరో గా తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలో రుపొందిచారు. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతుంది. కేజిఎఫ్ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరుపుకుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి ముఖ్యతిదిగా విచ్చేశారు. రాజమౌళి ఈ చిత్రం గురుంచి కొన్నిఆశక్తికర విషయాలను వెల్లడించారు. ఏప్రిల్ లో బెంగుళూరు తాజ్ హోటల్ లో కథ చర్చలు చేస్తున్నాను. అప్పుడు యష్ నన్ను కలిసి ఓ పది నిముషాలు టైం అడిగి కేజిఎఫ్ చిత్రం యొక్క విజువల్స్ చూపించాడు. నేను ఆ విజువల్స్ చూసినప్పుడు. నేను ఈ సినిమాకు ప్లాట్ అయిపోయాను. సినిమా విజువల్స్ లో ఎంతో క్వాలిటి తీసుకువచ్చారు.
హాలీవుడ్ చిత్రంలో చూపించిన విజువల్స్ కాకుండా ఒరిజినల్ విజువల్స్ ఉపయోగించారు. ఇలాంటి విజువల్స్ రావాలంటే మాములు విషయం, కాదు దీనికి ఎంతో టైం పడుతుంది. ఇంత క్వాలిటి విజువల్స్ రాబట్టడానికి ౩ ఇయర్స్ పట్టింది…. నేను వెంటనే హింది, తెలుగు, వెర్షన్ రైట్స్ ను హిందిలో అనిల్ తడానికి, తెలుగులో శోభు యార్లగడ్డకు చెప్పాను. అలాంటి విజువల్స్ రావాలంటే మంచి డబ్బులు పెడితేనో లేక హీరో, దర్శకుడు డేట్స్ ఇస్తేనోరావు. యష్ ఒక బస్సు డ్రైవర్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీస్ లో కొనసాగుతున్నాడు. వాళ్ల ఫాదర్ ఇప్పటకి కూడా బస్సు నడుపుతూనే జీవనం సాగిస్తున్నాడు అన్నారు. ఈ చిత్రం ఇండియా వైడ్ గా విజయం సాదించాలని కోరుకుంటున్నా అన్నారు.