యాంకర్ ప్రదీప్ ఈమద్య కాలంలో బుల్లి తెరను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. సుమ తర్వాత అంతటి క్రేజ్‌ను దక్కించుకున్న ప్రదీప్ ప్రస్తుతం అమ్మాయిల కలల రాకుమారుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరో కంటే ఎక్కువ క్రేజ్‌ను దక్కించుకున్న ప్రదీప్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. మాటీవీలో ప్రసారం కాబోతున్న పెళ్లి చూపులు షో ఫైనల్ విన్నర్‌ను ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా స్టార్ మా వారు ప్రచారం చేస్తున్నారు.
ఇలా రియాల్టీ షోల్లో పెళ్లి చూపులు పెట్టుకుని, పెళ్లి చేసుకునే పద్దతి ఇంకా ఇక్కడి వరకు రాలేదు. అయితే ప్రదీప్ ఆ పద్దతికి శ్రీకారం చుడతాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. పెళ్లి చూపులు షో అంతా అయిన తర్వాత ఫైనల్ విన్నర్‌కు ఊరికే అన్నాను, పెళ్లి చేసుకోను అంటూ చెబితే ఎలా ఉంటుందో అంటూ కొందరు సోషల్ మీడియాలో అప్పుడే జోకు వేస్తున్నారు.
అయితే ప్రదీప్ ఈ పెళ్లి చూపులు నిజంగానేనా, లేదా షో పబ్లిసిటీ కోసమా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రదీప్ పెళ్లి చూపులు కోసం అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.