Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కబోతున్న 25వ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్ు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా అనుకున్న సమయానికి కాకుండా ఆలస్యంగా మహేష్‌బాబు 25వ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపస్తుంది. అందుకే కారణం నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి. ముందుగా మహేష్‌బాబుతో సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మించేందుకు ప్రసాద్ వి పొట్లూరి ముందుకు వచ్చాడు. స్క్రిప్ట్ రైటింగ్‌కు ప్రసాద్ పోట్లూరి ఆర్థిక వనరులు సమకూర్చాడు. కారణం ఏంటో కాని మహేష్‌బాబు, వంశీ పైడిపల్లిల సినిమా దిల్‌రాజు, అశ్వినీదత్ వద్దకు వెళ్లింది.
తన బ్యానర్లో చేస్తానన్న చిత్రంను వంశీ పైడిపల్లి వేరే నిర్మాతలతో చేస్తున్నాడు అంటూ నిర్మాతల మండలిలో పీవీపీ ఫిర్యాదు చేశాడు. అప్పుడు ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పీవీపీ ఈ వివాదాన్ని ఇంకా వదిలి వేయలేదని, కోర్టులో ఈ వివాదం ఉండటంతో సినిమా చిత్రీకరణ ప్రారంభించకూడదని తెలుస్తోంది. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు ప్రస్తుతం పీవీపీతో చర్చలు జరుపుతున్నాడట. త్వరలోనే ఈ విషయమై ఒక పరిష్కారం కనిపెట్టాలని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. మహేష్‌బాబు గతంలో ప్రసాద్ వి పొట్లూరి నిర్మాణంలో ఒక చిత్రాన్ని చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ విషయం కూడా కేసులో ఉంది. మొత్తానికి ప్రసాద్ వి పొట్లూరి కారణంగా మహేష్‌బాబు 25వ చిత్రానికి పెద్ద తలనొప్పి అయ్యింది.