Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నిజమైన అజ్ఞాతవాసి ఎవరో తెలుసా…అంటూ ఈ ఉదయం ట్వీట్ చేసిన పవన్…దానికి సమాధానం చెబుతూ మధ్యాహ్నం తర్వాత మరో ట్వీట్ చేశారు. నిజమైన అజ్ఞాతవాసి టీవీ 9 చానల్ సీఈవో రవిప్రకాశ్ అని పవన్ చెప్పారు. టీవీ 9 చానల్ తమ రాజకీయ బాసులతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపించిందని, రవిప్రకాశ్ మార్గదర్శకత్వంలో తన తల్లిని చెప్పరాని మాటలతో పదే పదే తిట్టించారని ఆరోపించారు. శ్రీసిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కయిన రవిప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టారని పవన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించడమేమిటని శ్రీనిరాజ్ ను ప్రశ్నించారు. శ్రీనిరాస్ తనకు పంపిన లీగల్ నోటీసుల ప్రతిని పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. అటు శుక్రవారం హైదరాబాద్ లోని ఫిలింఛాంబర్ వద్ద ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వాహనాలపై పవన్ కళ్యాణ్ అభిమానులు దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఉప్పల్ కు చెందిన భాను ప్రసాద్, రామాంతపూర్ కు చెందిన సాయికిరణ్ రెడ్డి, చైతన్యపురికి చెందిన హరికృష్ణారెడ్డి, కూకట్ పల్లికి చెందిన అంబటిగోపి ఫణీంద్ర, కంటిపూడి రామకృష్ణను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Raviprakash ,I will text to you separately .. give me sometime.kindly wait! Apologies for making you wai!🙏😊
— Pawan Kalyan (@PawanKalyan) April 21, 2018