పవన్ ఛానెల్స్ బ్యాన్ వెనుక పెన్ డ్రైవ్ ఉందా ?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొద్దిరోజుల క్రితం వరకు ఎటువంటి సెన్సేషనల్ న్యూస్ ఐటమ్స్ లేకుండా కేవలం ఒక ప్రత్యేక హోదా ఉద్యమమే మెయిన్ గా సాగుతున్న తరుణంలో మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియానంతటిని తన వైపుకి తిప్పుకోవడంలో విజయం సాధించింది నటి శ్రీ రెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాటం అంటూ అర్ధ నగ్న ప్రదర్శన చేసినా వచ్చిన మైలేజ్ కంటే పవన్ తల్లిని ఒక బూతు మాట అనడంతో ఆమె బాగా పాపులర్ అయిపొయింది. అంతటిది పవన్ ఇమేజ్ ఇప్పుడు ఆ ఇమేజ్ ని దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతోందా ? , ఇప్పటి వరకు ప్రజా నాయకుడిగా, జన నేతగా పిలిపించుకున్న పవన్ రేపు ఒక తప్పు చేసిన వాడిలా ప్రజల ముందు నుంచునే రోజు వస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చర్చే హాట్ హాట్ గా నడుస్తోంది. కొన్ని రోజుల కిందట పవన్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీదాడులు జరిగాయట.(ఈ విషయం పవన్ టీడీపీ తో విభేదించక ముందు పవనే స్వయంగా ప్రకటించాడు) ఆ రైడ్ సందర్భంగా కొన్ని కీలకమైన పత్రాలతో పాటు మరికొన్ని వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ లను అధికారులు తమతో తీసుకెళ్లారట. ఈ విడియోలు కేంద్రం దాకా వెళ్ళడంతో ఆ పెన్ డ్రైవ్ ఆధారంగా పవన్ కల్యాణ్ ను కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తూ, ఓ ఆట ఆడిస్తోందని, అందుకే బీజేపీ నేతలు చెబుతున్నట్టల్లా జనసేనాని ఆడుతున్నారనే వాదనలు వినిపించాయి. అయితే ఆ వ్యాఖ్యలకి బలం చేకూర్చేలాగా పవన్ పార్టీ ఆవిర్భావ సభ జరగక 15 రోజుల ముందు చంద్రబాబు పాలన భేష్ అని పొగిడి, సభ రోజున బాబు, లోకేష్ ల అవినీతి అని అర్ధం లేని వ్యాఖ్యానాలు చేశారు.

దీంతో ఇదంతా కేంద్రం పెద్దలు చేసిందేనని వారు చెప్పినట్టే పవన్ నడుచుకుంటున్నాడనేది రాజాకేయా వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే చంద్రబాబు, లోకేష్ పై పవన్ అవినీతి ఆరోపణలు చేస్తున్నారట. లేదంటే పవన్ కు టీడీపీతో తెగదెంపులు చేసుకునే ఉద్దేశ్యం లేదని బీజేపీ బలవంతంతోనే చంద్రబాబు సర్కార్ అవినీతిపై ఏకంగా విచారణ జరిపించాలనే డిమాండ్ కూడా తెరపైకొచ్చిందని అంటున్నారు. ఆ వాదనకి మరింత బలం చేకూర్చేలాగా ఆ మధ్య ఓ తెలుగు న్యూస్ ఛానెల్*(ఏపీ 24*7) ఇదే విషయాన్ని పవన్ వద్ద ప్రస్తావించింది. మీ ఇంటిపై ఐటీ దాడులు జరిగిన మాట నిజమేనా అంటే పవన్ ముక్తసరిగా తను ప్రిపేర్ అయి ఇంటర్వ్యూకు రాలేదని, మరోసారి ఈ అంశంపై స్పందిస్తానని తప్పించుకున్నారు. పవన్ వ్యాఖ్యల్ని జాగ్రత్తగా గమనిస్తే, ఆయన టీడీపీపై మాత్రమే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీకి జనసేనకు సంబంధం లేదంటున్నారే తప్ప, ఆ నేతలపై మాత్రం ఆయన పల్లెత్తు మాట కూడా అనడంలేదు.

అయితే ఫిలిం నగర్ వర్గాల సమాచారం బట్టి పవన్ కి సంబందించిన ప్రైవేటు వీడియోలు ఆ పెన్ డ్రైవ్స్ లో ఉన్నాయని, దాని తాలూకా కాపీ ఒకటి తెలుగు చానెల్ ఒకటి సంపాదించింది అని, మరో రెండు మూడు రోజుల్లో ఆ వీడియో ని సదరు చానెల్ బట్టబయలు చేద్దాం అనుకునే లోపు పవన్ మీద శ్రీ రెడ్డి దూషణతో పవన్ వ్యూహాత్మకంగా ఆలోచించి ఆ చానెల్ తో బాటు మరో రెండు చానెల్స్ తన తల్లి మీద పడ్డ మాటని పదే పదే ప్రసారం చేసారు అనే వంకతో ఆ చానెల్స్ ని బహిష్కరించమని తన అభిమానులకి సందేశం ఇచ్చేశాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

అయితే ఇప్పుడు ఈ వీడియోలు రిలీజ్ చేస్తే తానూ బహిష్కరించాననే కోపంతో సదరు చానెల్స్ కావాలనే నా మీద ఫేక్ వీడియోలు తయారు చేసి వదిలారని, తన అభిమానుల వద్ద మాట పోగొట్టుకోకుండా ఉండేందుకు పవన్ ఈ ప్లాన్ చేసినట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఆ వీడియోలు ఫేక్ అని వాదించేందుకు వీలుగా కొద్ది రోజుల క్రితమే జనసేన తన ట్విట్టర్ నుండి ఫేక్ వీడియోలు తాయారు చెయ్యడం, గుర్తించడం ఎలా అంటూ ఒక విడియో ని సైతం విడుదల చేసింది.

అంతే గాక నిన్న పవన్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి చేసిన మరో ట్వీట్ కూడా ఇప్పుడు అనుమానాలని రేకెత్తిస్తోంది, దాని ప్రకారం తన అభిమానులు సంయమనం కోల్పోవద్దని పవన్ ట్వీట్లు చేశారు. కొంతమంది మీడియా చానళ్ల పెద్ద తలకాయల తాను సుదీర్ఘ న్యాయ పోరాటం చేయబోతున్నానని చెప్పారు. జనసేన కార్యకర్తలు అభిమానులు…ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని పవన్ పిలుపునిచ్చారు. అయితే దీనిని పరోక్షంగా పవన్ ఫ్యాన్స్ కి ఇచ్చిన సిగ్నల్ గా కొందరు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. పవన్ ప్రారంభించిన ఈ గేమ్ ఎక్కడివరకు వెళుతుందో అని విశ్లేషకులు భావిస్తున్నారు.