Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జనాలు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని గగ్గోలు పెడుతుంటే… ఈయనకు ఓ వింత ఐడియా వచ్చింది. దేశంలో గో రక్షణ ఉద్యమానికి అనుబంధంగా… పెట్రోల్ పై గో సెస్సు వేయాలని కేంద్రానికి సూచించారు స్వామి. ఇది పైత్యమా… ప్రకోపమా అర్థం కాక బీజేపీ జనాలే జుట్టుపీక్కుంటున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న గోశాలలకు దండిగా నిధులొస్తేనే… గోవులు బాగుంటాయని. అందుకే వాటిని మెయింటైన్ చేయడానికి జనంపై పన్ను పీకాలని స్వామిగారు సెలవిచ్చారు. ఇప్పటికి ఉన్న పన్నులు సరిపోవని… కొత్త వడ్డింపులు ఎందుకని ప్రశ్నిస్తున్నారు జనం. అసలు మనుషులే తిండిలేక చచ్చిపోతుంటే… బీజేపీ నేతలకు ఈ గో పిచ్చి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.
గోవు పవిత్ర జంతువే. కానీ అది వ్యక్తిగతం. అంతే కాని దేశవ్యాప్తంగా ఉద్యమస్థాయిలో గోరక్షణ చేపట్టాలని, ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరడం మాత్రం హద్దులు మీరడమే. అసలు బీజేపీ నేతలు మోడీ అండ చూసుకునే ఇలా రెచ్చిపోతున్నారని, ఆయనగారు బుద్ధిమంతుడిలా ఉపన్యాసాలు దంచుతుంటే… వీళ్లేమో ఇలాంటి తేడా మాటలు మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. డబుల్ గేమ్ ఎప్పటికైనా డేంజరేనని బీజేపీకి ఎప్పుడు తెలుస్తుందో..?