సుధీర్‌బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సమ్మోహనం’ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. ఈ చిత్రం గురించి మొదటి నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ఫస్ట్‌లుక్ ఇలా అన్ని విధాలుగా సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇంద్రగంటి సినిమాలు అంటే క్లాస్ సినిమాలకు పెట్టింది పేరు. అందుకే ఈయన దర్శకత్వంలో సినిమా అనగానే ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో అంచనాలుంటాయి. అంచనాలకు తగ్గట్లుగా ఓవర్సీస్‌లో సినిమా ఆకట్టుకుంటుంది. రికార్డు స్థాయిలో సుధీర్‌బాబు ఈ చిత్రంతో వసూళ్లు సాధిస్తున్నాడు. మిలియన్ మార్క్‌ను సుధీర్‌బాబు చేరడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే హాఫ్ మిలియన్‌ను క్రాస్ చేసిందని, ఈ వారాంతంకు ఖచ్చితంగా మిలియన్ మార్క్‌ను అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు.
సుధీర్‌బాబు యూఎస్‌లో విడుదల అవ్వడమే గగనం అంటే, ఇప్పుడు ఏకంగా మిలియన్ మార్క్ అంటే ఖచ్చితంగా క్లాస్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇక సుధీర్‌బాబు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా ప్రభావంను చూపడంలో విఫలం అవుతున్నాడు. తెలుగు ప్రేక్షకుల నుండి కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నా కూడా భారీ వసూళ్లను దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం షేర్ ఆశించిన రేంజ్‌లో రాబట్టడంలో విఫలం అవుతుంది. సమ్మోహనం చిత్రానికి పెట్టిన పెట్టుబడి ఇప్పటికే రికవరీ అయినట్లుగా సమాచారం అందుతుంది. కాని సినిమా పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో నిర్మాతలు భారీ వసూళ్లను ఆశించారు. కాని అది సాధ్యం కాదని తేలిపోయింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో కాస్త వసూళ్లు సాధిస్తున్నప్పటికి తెలుగు బి, సి సెంటర్లలో మాత్రం పెద్దగా వసూళ్లు రాబట్టలేక పోతుంది.