5 కోట్ల సమ్మోహనంకు ఎంత వచ్చాయో తెలుసా?

sammohanam movie Worldwide Collections

సుధీర్‌బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఈయన చేసిన ప్రేమ కథా చిత్రమ్‌ మినహా ఏ ఒక్కటి కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదు. ప్రేమ కథా చిత్రం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ‘సమ్మోహనం’ చిత్రంతో సుధీర్‌బాబు సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మోహనం చిత్రం మంచి కమర్షియల్‌ సక్సెస్‌ను సాధించింది. పోటీగా పెద్ద చిత్రాలు లేకపోవడం, విడుదలైన చిన్న చిత్రాలు పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈ సినిమాకు కలిసి వచ్చింది.

సమ్మోహనం చిత్రాన్ని కేవలం అయిదు కోట్ల బడ్జెట్‌తో దర్శకుడు ఇంద్రగంటి తెరకెక్కించినట్లుగా చెబుతున్నారు. ఇక ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా 8 కోట్ల షేర్‌ను వసూళ్లు చేసింది. నిర్మాత ఈ చిత్రంతో భారీగానే లాభపడ్డట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. 8 కోట్లు షేర్‌ రూపంలో రాగా, శాటిలైట్‌ రైట్స్‌ రూపంలో 3.2 కోట్లు రాబోతున్నాయి. ఇక ప్రైమ్‌ వీడియో, ఆన్‌లైన్‌ రైట్స్‌, ఆడియో రైట్స్‌ ఇలా మరో రెండు కోట్లు రాబోతున్నాయి. మొత్తంగా సమ్మోహనంతో నిర్మాత 14 కోట్లను తన ఖాతాలో వేసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. పెట్టుబడి పోను దాదాపుగా పది కోట్లు ఈయనకు లాభం అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ప్రస్తుత సమయంలో ఇంతటి లాభంతో సినిమాలు రావడం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. మంచి కంటెంట్‌ ఉంటే బడ్జెట్‌తో సంబంధం లేకుండా బిజినెస్‌ అవుతుందని చెప్పడానికి ఇదే నిదర్శణం. సమ్మోహనం కారణంగా సుధీర్‌బాబు కెరీర్‌ మళ్లీ ఊపందుకుంది.