‘జటాధర’ అవతారంలో సుధీర్ భాబు.. ఫస్ట్ లుక్ అదుర్స్ …!

Sudheer Babu in 'Jatadhara' avatar.. First Look Adurs ...!
Sudheer Babu in 'Jatadhara' avatar.. First Look Adurs ...!

నవదళపతి సుధీర్ బాబు నటించిన రీసెంట్ సినిమా ‘హరోం హర’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, సుధీర్ బాబు పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

ఇక ఇప్పుడు సుధీర్ బాబు తన కొత్త మూవీ పై అప్డేట్ ఇచ్చాడు. ‘జటాధర’ అనే మరో పవర్‌ఫుల్ టైటిల్‌తో తన నెక్ట్స్ సినిమా కి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని రివీల్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే, ఇందులో కూడా సుధీర్ బాబు ఒక పవర్‌‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు స్పష్టమవుతుంది .

Sudheer Babu in 'Jatadhara' avatar.. First Look Adurs ...!
Sudheer Babu in ‘Jatadhara’ avatar.. First Look Adurs …!

ఈ మూవీ ను వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీ తెలుగు, హిందీ ద్విభాషా మూవీ గా మేకర్స్ తెరకెక్కించనున్నారు. ఈ మూవీ షూటింగ్‌ని అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లు వారు ప్రకటించారు. శివన్ నారంగ్, ప్రేరణా అరోరా, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ ఈ మూవీ ని  ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2025 మహాశివరాత్రికి ఈ మూవీ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.