సుధీర్ బాబు ‘హ‌రోం హ‌ర’ ప‌వ‌ర్ ఫుల్ ట్రైల‌ర్ అదుర్స్ .. !

Sudhir Babu's 'Harom Hara' Powerful Trailer Adurs .. !
Sudhir Babu's 'Harom Hara' Powerful Trailer Adurs .. !

హీరో సుధీర్ బాబు న‌టిస్తున్న తాజా సినిమా ‘హ‌రోం హ‌ర’ ఇప్ప‌టికే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాకు జ్ఞానసాగ‌ర్ ద్వార‌క డైరెక్టర్ గా చేసారు ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ట్రైల‌ర్ ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రిలీజ్ చేశారు.

Sudhir Babu's 'Harom Hara' Powerful Trailer Adurs .. !
Sudhir Babu’s ‘Harom Hara’ Powerful Trailer Adurs .. !

‘హ‌రోం హ‌ర’ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కోసం సుధీర్ ఎంత‌లా క‌ష్ట‌ప‌డ్డాడో మ‌నకు క‌నిపిస్తుంది. పూర్తిగా చిత్తూరు యాస‌లో సాగిన ఈ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది. తుపాకుల నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో యాక్ష‌న్ కు కొద‌వే లేద‌ని ఈ ట్రైల‌ర్ చూస్తుంటే అర్ధమవుతుంది . అటు సునీల్ కూడా మ‌రోసారి త‌న‌దైన ప‌ర్ఫార్మెన్స్ తో ఈ సినిమాకు అసెట్ గా మార‌నున్న‌ట్లు ట్రైల‌ర్ క‌ట్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.అద్భుత‌మైన మాస్ డైలాగుల‌తో ‘హ‌రోం హ‌ర’ ట్రైల‌ర్ ఇంప్రెసివ్ గా ఉంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయికగా నటించింది. వీరితో పాటు జయప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే మొదలైన ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 14న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ గా ఉంది..

మీరు ట్రైలర్ ని చూడాలంటే ఈ వీడియో ని క్లిక్ చేయండి