ఓ కామెడీ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.సుధీర్ పెళ్లిపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సుధీర్ మాత్రం యాంకర్, నటి రష్మీ పై మనసు పారేసుకున్నాడని అందుకే పెళ్లిని వాయిదా వేస్తున్నాడనే వార్తలు చాలా కాలంగా నెట్టింట షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా సుధీర్ పెళ్లిపై అతడి స్నేహితులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను మాత్రం కాస్త సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
తన వయస్సు ఇప్పటికే 34 ఏళ్ళు దాటిపోవడంతో వెంటనే సుధీర్ పెళ్లి సంబంధాల వేటలో పడిపోయినట్టు తెలిసింది. తాజాగా తమ ఫ్యామిలీకి చెందిన అత్యంత సన్నిహితుల ద్వారా ఓ సంబంధం కుదిరినట్లు తెలుస్తోంది. ఆ సంబంధం సుధీర్‌కు బాగా నచ్చి ఓకే కూడా చెప్పేసినట్లు కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇక అమ్మాయి కూడా సుధీర్ సొంత జిల్లాకు చెందిన యువతే అని తెలుస్తోంది. అయితే దీనిపై సుధీర్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.