అయితే తాజాగా మెదక్ జిల్లాలోని రామాయంపేటలో ఓ యువకుడు మూడంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికుల వెల్లడించిన విషయాలను బట్టి రాజస్థాన్ కు చెందిన శరవణ్ కుమార్ అనే యువకుడు 3 నెలల క్రితం బతుకుదెరువు కోసం రామాయంపేటకు వచ్చాడు. అదే ఊరులో అతడు పైపుల దుకాణంలో పనిచేస్తున్నాడు. కాగా ఉన్నట్లుండి ఆర్థిక ఇబ్బందులతోనే ఆయువకుడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. కాగా కరోనా కష్టకాలం, అలాగే.. ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం వచ్చిన యువకుడు ఆర్థిక సమస్యలతో సతమతమౌతూ ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం ఆ గ్రామలో కలకలం రేపుతోంది.