Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ వాణి బలంగా వినిపించింది. సభ వెలుపల గాంధీ విగ్రహం దగ్గర ఆంధ్రాకి న్యాయం చేయాలంటూ సాగిన ఆందోళన క్రమంగా లోక్ సభ వెల్ దాకా వెళ్ళింది. సభలోనూ విభజనతో దెబ్బ తిన్న ఆంధ్రని ఆదుకోవాలన్న డిమాండ్ తో టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. మిత్రధర్మం పాటించడం లేదని ప్లకార్డులు పట్టుకున్నారు. అటు వైసీపీ ఎంపీలు కూడా ఆంధ్రని ఆదుకోవాలంటూ గళం ఎత్తారు. బీజేపీ ఈ పరిణామాలను ఏ మాత్రం ఊహించలేదు. టీడీపీ సభ లోపల, వెలుపల సైతం టీడీపీ ఎంపీ లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండడంతో ప్రధాని మోడీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ని చర్చలకు పిలిచారు. దాదాపు ఇరవై నిమిషాలపాటు జరిగిన ఈ చర్చల్లో బడ్జెట్ లో ఆంధ్రకు జరిగిన అన్యాయంతో పాటు, విభజన హామీలు నెరవేర్చని విషయాన్ని కూడా మోడీతో సుజనా చౌదరి ప్రస్తావించారు. ప్రధాని మోడీ ఈ అంశంపై ఏ విధంగా స్పందించారో ఇంకా బయటకు రాలేదు.