యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతూ ఓ సినిమా చేస్తున్నారు. దానికి `బబుల్గమ్` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో టీజర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. నాని గెస్ట్ గా వచ్చి టీమ్‌ని అభినందించారు. అయితే టీజర్ మాత్రం చాలా బోల్డ్ గా ఉంది. శృతి మించిన బూతు డైలాగ్‌లతో నింపేశారు.
యాంకర్ సుమ కొడుకు సినిమా ఇలా ఉందేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. ఇందులో టీజర్ చివర్లో రోషన్.. హీరోయిన్‌కి సముద్రంలో లిప్‌లాక్ పెట్టడమే ఓవర్ డోస్‌గా ఉన్నది . దీనికి తోడు విలన్‌కి హీరో పరమ బూతు పదంతో వార్నింగ్ కూడా ఇస్తాడు. ఇది హాట్ టాపిక్ అవుతుంది. అయితే అనంతరం ఈవెంట్లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ కొడుకుని బాగా అభినందించారు. టీజర్లో బాగా చేశావని, మూవీ లో కూడా బాగా చేసి ఉంటావని నమ్ముతున్నారు.
Video Link : https://www.youtube.com/watch?v=gXFhJD6OTII
అయితే దీనిపై నెటిజన్ల నుంచి సెటైర్లు, విమర్శలు పేలుతున్నాయి. యాంకర్ సుమ అంటే అందరిలో ఒక మంచి అభిప్రాయం ఉంది. పాజిటివ్‌గా తీసుకుంటారు. కానీ ఆమె కొడుకు మూవీ ల్లో ఇలాంటి బూతులు ఉండటం పట్ల వారి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఇది చాలా ఇబ్బందిగా ఉందని, పైగా స్టేజ్‌పై రాజీవ్, సుమ అలా మాట్లాడటం కూడా ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. అయితే ఇటీవల మూవీ ల్లో బూతు డైలాగులు, అమ్మాయిలను తిట్టడం, బోల్డ్ సీన్లు శృతి మించి ఉంటున్నాయి. అదే సక్సెస్ ఫార్ములా మారింది. చాలా వరకు అలాంటి కంటెంట్ ఉన్న సినిమా లు సక్సెస్ కావడం గమనార్హం. ఇటీవల వచ్చిన `మ్యాడ్`, `బేబీ`, `అర్జున్‌రెడ్డి` సినిమా లు ఆ కోవకే చెందుతాయి.