ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేఏపాల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆయనకి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ సైట్స్‌లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆయన బయోపిక్ రూపొందించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తుండగా, ఇందులో సునీల్ కేఏపాల్‌గా నటిస్తాడట. ప్రస్తుతం సునీల్ అమెరికాలో ఉండగా ఆయనకి హాలీవుడ్ మేకప్ మ్యాన్ మేకొవర్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్, హాలీవుడ్ స్టార్ నటి ఏంజెలీనా జోలీ పాత్రలు కూడా ఉంటాయట. వాటికి సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా జరగుతుందట. సునీల్ అమెరికా నుండి హైదరాబాద్ వచ్చాక చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయనున్నారని ఇన్సైడ్ టాక్ . హీరో నుండి మళ్ళీ కమెడీయన్‌గా టర్న్ తీసుకున్న సునీల్ చివరిగా చిత్రలహరిలో నటించాడు. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా తెరకెక్కుతురన్న చాణక్య చిత్రంలో నటిస్తున్నాడు.