పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తాజాగా రెండవ పెళ్లికి సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇటీవలే ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. త్వరలోనే రేణుదేశాయ్ పెళ్లి కూడా జరుగబోతుంది. పవన్ నుండి విడిపోయిన తర్వాత సింగిల్ మదర్‌గా చాలా సంవత్సరాలు ఉన్న రేణుదేశాయ్ ఇప్పుడు తనకు తోడు కావాలి అనిపిస్తుందంటూ పెళ్లికి సిద్దం అయ్యింది. అచ్చు ఇలాగే సింగర్ సునీత కూడా రెండవ పెళ్లికి సిద్దం అయ్యింది. చాలా చిన్నవయస్సులో వివాహం చేసుకున్న సునీత భర్త కిరణ్ నుండి చాలా సంవత్సరాల క్రితమే విడిపోయింది. తన ఇద్దరు పిల్లలను స్వశక్తితో పెంచుతున్న సునీత వారు పెద్ద వారు అవ్వడంతో ఒంటరితనం భరించలేక రెండవ పెళ్లికి సిద్దం అయ్యిందని తెలుస్తోంది. విశాఖకు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఈమె వివాహం జరుగబోతుంది.
రెండవ పెళ్లి విషయంపై తాజాగా ఫేస్‌బుక్ ద్వారా స్పందించిన సునీత ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు ఇంత ఆసక్తి అంటూ పోస్ట్ చేసింది. ఈమె పోస్ట్ రెండవ పెళ్లి వార్తలకు బలంను చేకూర్చుతున్నాయి. రెండవ పెళ్లి వార్తలు పుకార్లే అయితే తాను పెళ్లి చేసుకోబోవడం లేదు అని లేదంటే తన గురించి వస్తున్న వార్తలు పుకార్లే అంటూ చెబితే సరిపోతుంది. కాని సునీత కాస్త విభిన్నంగా స్పందించడంతో పెళ్లి వార్తలు నిజమేనేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సునీత రెండవ పెళ్లికి కుటుంబ సభ్యులు అంతా కూడా గత కొన్ని రోజులుగా ఒప్పించేందుకు ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లకు సునీత పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సునీత వివాహం చేసుకోబోతున్న వ్యక్తి కూడా రెండవ పెళ్లి అతనే అంటూ సమాచారం అందుతుంది. ఈ విషయాపై సునీత మరింత క్లారిటీ ఇచ్చే వరకు ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది.