బాలకృష్ణ కోసం సూపర్ మాస్ సాంగ్..!

Super mass song for Balakrishna..!
Super mass song for Balakrishna..!

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఒక మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ మూవీ కి సంబంధించి తమన్ మాట్లాడుతూ.. ‘ఎన్బీకే 109 మూవీ రష్ చూశాను. బాలయ్య అభిమానులకి ఈ మూవీ పెద్ద పండగే’ అంటూ చెప్పడం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఐతే, అదే ఊపుతో తమన్ ఈ మూవీ కోసం ఒక అదిరిపోయే మాస్ సాంగ్ ని అందించారట. బాలయ్య పాత్ర గ్రాఫ్ పై సాగే ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని.. వచ్చే షెడ్యూల్ లో ఈ క్రేజీ సాంగ్ ని షూట్ చేస్తారని తెలుస్తుంది.

Super mass song for Balakrishna..!
Super mass song for Balakrishna..!

మొత్తమ్మీద ఈ సినిమా కచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ఈ మూవీ ని తీర్చిదిద్దుతున్నారట. ఏది ఏమైనా ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ మూవీ పై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీ లో బాలయ్య పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.