మిమల్ని ఆ దేవుడే కాపాడాలి…తెలుగు సీబీఐ అధికారి మీద షాకింగ్ కామెంట్స్ !

Supreme Court Shocking Comments On CBI EX Director Nageswara Rao
బీహార్ లోని ముజఫర్‌పూర్‌లో ఒక వసతి గృహంలో నివసిస్తున్న 29 మంది బాలికలు భౌతిక, లైంగిక దాడులకు గురైనట్లు ముంబయికి చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైనెస్స్‌ నిర్వహించిన ఆడిట్‌ లో వెలుగుచూడంతో బీహార్‌ లో కలకలం రేగిన సంగతి తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు ఆందోళనలతో బీహార్‌ ప్రభుత్వం ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. అయితే ఇప్పుడు ఈ కేసులో సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా పనిచేసిన ఎం.నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. ముజఫర్‌పూర్‌ బాలికల వసతి గృహం కేసును విచారిస్తోన్న అధికారి ఏకే శర్మను బదిలీ చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా విచారణ అధికారిని ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తారంటూ మండిపడింది. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలని వ్యాఖ్యానిస్తూ, ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని ఆగ్రహం వ్యక్తంచేసింది. తాత్కాలిక డైరెక్టర్‌గా చేసిన బదిలీలపై వివరణ ఇవ్వాలని సీజేఐ రంజన్ గొగోయ్ స్పష్టంచేశారు. ఫిబ్రవరి 12న నాగేశ్వరరావు, ఇతర అధికారులు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. సీబీఐలో వివాదం తలెత్తడం.
ఆ సమయంలో కేంద్రం సీబీఐ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్ ని సెలవుపై పంపి.. ఎం.నాగేశ్వరరావు ను సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే నాగేశ్వరరావు తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరించిన కాలంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ అవేమీ పట్టించుకోకుండా ఏకే శర్మతో పాటు మరికొందరిని ఆయన బదిలీచేశారు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శర్మను బదిలీ చేసిన వ్యవహారంలో ఏఏ అధికారుల పాత్ర ఉందో తేల్చాలని సీబీఐకు సూచించింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ అయిన శర్మ ముజఫర్‌పూర్‌ వసతి గృహానికి సంబంధించిన కేసులను విచారిస్తోన్న సీనియర్‌ అధికారి. విచారణ ముగిసే వరకు ఆయన్ను బదిలీ చేయొద్దని గతంలోనే కోర్టు ఆదేశించింది. సీబీఐలో చెలరేగిన అంతర్గత వివాదం కారణంగా సంస్థలో ఆయన పదవీకాలం ముగియక ముందే జనవరి 17, 2019న సీఆర్‌పీఎఫ్ ఏడీజీపీగా బదిలీ చేసారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో చివాట్లు తిన్నారు.