సక్సెస్‌ మీట్‌లపై సురేష్‌బాబు సంచలన వ్యాఖ్యలు

Suresh Babu sensational comments on movies Success Meets

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చెత్త సంస్కృతి మొదలైంది. అది సినిమా సక్సెస్‌ అయినా లేదా ఫ్లాప్‌ అయిన విడుదలైన వెంటనే సక్సెస్‌ మీట్‌ అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విక్టరీ సింబల్‌ను చూపిస్తున్నారు. ప్రేక్షకుల ఆధరణ దక్కించుకోని సినిమాలు కూడా సక్సెస్‌ మీట్‌లు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏ చిత్రం సక్సెస్‌ ఏ సినిమా ఫ్లాప్‌ అనే విషయాన్ని తేల్చుకోలేకుండా పోయింది. ఈ విషయాన్ని సినిమా పెద్దలు పలువురు ఖండిస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత, స్టూడియో అధినేత అయిన సురేష్‌బాబు ఈ విషయమై స్పందించారు.

సురేష్‌బాబు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళకరంగా ఉంది. సినిమా పరిశ్రమకు చెందిన పలు నిజాలను కార్పెట్‌ కింద దాచేసి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచి పరిణామం కాదు. ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా ఇది ప్రభావంను చూపుతుంది. ఒక సినిమాను విడుదలైన నెల రోజుల్లోనే టీవీలో వేస్తున్నారు. ఇది కూడా ఎంత మాత్రం మంచిది కాదు. కొన్ని రోజులు అయితే సినిమాను నేరుగా టీవీల్లోనే విడుదల చేస్తారేమో అంటూ సురేష్‌బాబు అనుమానంను వ్యక్తం చేస్తున్నారు. కోటి బడ్జెట్‌తో తీసిన సినిమాను కోటికి పైగా పెట్టి ప్రమోట్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో చిన్న నిర్మాతలు ఏమవ్వాలి. సినిమా పరిశ్రమలో చాలా మార్పులు రావాలి, నిర్మాతలు కొంత మంది తమ పద్దతిని మార్చుకోకుంటే భవిష్యత్తులో సినిమా పరిశ్రమ ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిర్మాత సురేష్‌బాబు అంటున్నాడు.