జనసేన ఆఫీస్ వివాదం వెనుక భారీ కుట్ర?.

Janasena Party Office Land In Guntur turns Controversial

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
చినకాకానిలో ఏర్పాటు కానున్న జనసేన ప్రధాన కార్యాలయం విషయంలో లేని వివాదాన్ని సృష్టించడానికి కుట్ర జరుగుతోందా ?. ఔను… అది కుట్ర జరుగుతోంది అంటున్నారు స్థల యజమానులు. ముస్లిం మైనారిటీల పేరు చెప్పి వివాదం సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాల వెనుక వైసీపీ కుట్ర ఉందని జనసేన స్థానిక నాయకత్వం సందేహిస్తోంది. జనసేన కార్యాలయ స్థలానికి సంబంధించి ఆరోపణలు చేసిన వ్యక్తి వైసీపీ తో అంటకాగుతున్నట్టు కూడా జనసేన దృష్టికి వచ్చిందట. ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలు తెలుసుకోవాలని పవన్ నుంచి ఆదేశాలు వచ్చాయట. దానికి అనుగుణంగా జనసేన నాయకులు జరిపిన పరిశీలనలో స్థలానికి సంబంధించి ఏ వివాదాలు లేవని తేలిందట. లేని వివాదాన్ని సృష్టించడానికి ప్రయత్నించిన వ్యక్తి మీద పరువు నష్టం దావా వేయడానికి ఇటు జనసేన, అటు భూ యజమానులు సిద్ధం అవుతున్నారు. ఈ విషయం మీద విజయవాడలో జనసేన నేత గద్దె తిరుపతిరావు, భూ యజమాని యార్లగడ్డ వెంకటేశ్వరరావు ఏమి మాట్లాడారో చూద్దాం.

  • గద్దె తిరుపతి రావు… జనసేన నాయకులు

  • జనసేన పార్టీ కార్యాలయం స్థల వివాదం రాజకీయ కుట్ర

  • యార్లగడ్డ సుబ్బారావు ఈ స్థలాన్ని కొనుగోలు చేయగా… ఆయన కుమారులు వారసత్వంగా అనుభవిస్తున్నారు

  • వారు చెప్పిన సర్వే నెంబర్ కు, మా సర్వే నెంబరు కు ఎక్కడా పొంతన లేదు

  • జనసేన పార్టీ ఆ స్థలాన్ని మూడేళ్లు అద్దెకు తీసుకుంది

  • ఆన్ లైన్ లో అన్ని చూసుకున్నాకే మేము ఈ స్థలం యజమానులతో ఒప్పందం చేసుకున్నాం

  • భూ యజమానులపై ఎటువంటి కేసులు కోర్టులో లేవు

  • మా వాళ్లు వై సుబ్బారావు, వాళ్లు చెప్పంది ఎ.సుబ్బారావు

  • పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం దుర్మార్గం

  • దీని పై కోర్టులో పరువు నష్టం దావా వేస్తాం

  • యార్లగడ్డ వెంకటేశ్వరరావు… భూ యజమాని

  • మా నాన్న సుబ్బారావు 1958 లో ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు

  • అప్పటి నుంచి నేటి వరకు మేమే అక్కడ సాగు చేసుకుంటున్నాం

  • ఇన్నేళ్లలో ఏ రోజు కూడా కోర్టు కు వెళ్లలేదు… ఏ కేసులు లేవు.

  • జలీల్ అనే వ్యక్తి పై భూకబ్జాలు, మహిళల కిడ్నాప్ కేసులు ఉన్నాయి

  • అతను దురుద్దేశంతోనే అందర్ని తప్పుదారి పట్టించాడు.

  • మా కుటుంబాన్ని వివాదంలోకి లాగిన వారి పై పరవు నష్టం దావా వేస్తాం.