రజనీ అభిమానులకి సర్ప్రైజ్ !

Surprise Video From Petta Movie

ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం పేట‌. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌లై ఘన విజ‌యాన్ని సాధించింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతూ 4వ వారంలోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం విడుద‌లై నేటికి 25 రోజులు కావ‌డంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు త‌న ట్విట్ట‌ర్‌లో ర‌జనీకాంత్ పేట చిత్రానికి డైలాగ్ చెబుతున్న డ‌బ్బింగ్‌ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియో అభిమాన‌లుకి మంచి కిక్ ఇస్తోంది. ప్రతీకారాల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాకు రజనీ మేనరిజమ్స్‌ను జోడించి సినిమాని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ఇందులో ర‌జనీకాంత్ స‌ర‌స‌న సిమ్రాన్, త్రిష న‌టించారు. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మాతగా వ్యవహరించారు. త్వ‌ర‌లో ఏ ఆర్ మురుగ‌దాస్‌తో క‌లిసి రాజ‌కీయ నేప‌థ్యంలో చిత్రం చేయ‌నున్నాడు ర‌జ‌నీకాంత్‌.