Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఐక్యరాజ్యసమితిలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగంపై యావద్దేశం ప్రశంసలు కురిపిస్తోంది. ఐరాస వేదికపై పాక్ వైఖరిని ఎండగడుతూ సుష్మాస్వరాజ్… భారత్ ఐఐటీ,ఐఐఎంలతో విద్యావంతులను తయారుచేస్తోంటే…పాక్ ఉగ్రవాదులను ఉత్పత్తి చేస్తోందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ఒక్కమాటలో ప్రపంచానికి తెలియజెప్పారంటూ…అనేకమంది సుష్మాస్వరాజ్ ప్రసంగాన్ని ప్రశంసించారు. అయితే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం సుష్మా ప్రసంగాన్ని మరొక రీతిలో అర్ధం చేసుకున్నారు. అంతేకాకుండా దీనిపై వ్యగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు.
ప్రసంగంలో ఐఐటీ, ఐఐఎంల గురించి ప్రస్తావించినందుకు థ్యాంక్స్ అని…కనీసం ఈ రూపంలో అయినా కాంగ్రెస్ గొప్పతనాన్ని గుర్తించారని ట్వీట్ చేశారు. ఇండియాలో ఐఐటీలు, ఐఐఎంలను తామే నెలకొల్పామని గుర్తు చేస్తూ రాహుల్ ఈ కామెంట్లు చేశారు. అయితే రాహుల్ ట్వట్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యాసంస్థలతో పాటు పెద్ద పెద్ద కుంభకోణాలు సైతం కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఎద్దేవా చేస్తున్నారు. సుష్మా స్వరాజ్ దేశం గురించి మాట్లాడుతోంటే…రాహుల్ సంకుచితంగా ఆలోచిస్తూ పార్టీ గురించి మాట్లాడుతున్నారని…మండిపడు తున్నారు. ఇప్పడే కాదు…గతంలోనూ అర్ధరహిత విమర్శలు చేసి.అనేక సార్లు రాహుల్ గాంధీ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.