ఫేస్ బుక్ లవర్ మీద అనుమానం…ఆమెను కాల్చేసి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్…!

Suspicion On Face Book Lover

ఫేస్ బుక్ లో తనకు పరిచయమైన యువతితో పరిచయం పెంచుకున్న ఓ కానిస్టేబుల్, ఆమె మరెవరితోనో చనువుగా ఉంటోందని అనుమానంతో, ఆమెను కాల్చి చంపి, తనూ ఆత్మహత్య చేసుకున్న ఘటన. చెన్నై సమీపంలోని విల్లుపురంలో చితు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కార్తివేలు అనే యువకుడికి మెడిసిన్ చదువుతున్న సరస్వతి అనే యువతి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో పరిచయమైంది.

facebook-frnds

ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అయితే, గత కొంతకాలంగా సరస్వతి తనకు దూరమవుతూ, మరెవరికో దగ్గరవుతోందన్న అనుమానంతో ఉన్న కార్తివేలు సరస్వతి పుట్టిన రోజునాడు ఆమె పుట్టిన రోజు వేడుకల్లో పాలుపంచుకునేందుకు ఆమె వద్దకు వచ్చాడు. ఆపై వీరిద్దరి మధ్య వాగ్వాదం జరుగగా, తుపాకితో సరస్వతిని కాల్చిచంపిన కార్తివేలు, ఆపై తనను తాను కాల్చుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

face-book