తన సోదరుడిని హత్య చేసిన కేసులో 45 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నా పోలీసులు. తిరువనంతపురంలో నివాసముంటున్న బిను సోదరుడు రాజ్ మృతిలో అతడి పాత్రపై విచారణ జరుపుతున్నారు.
ఓనం సందర్భంగా వారి తల్లి బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. తల్లి తిరిగి వచ్చినా, రాజ్ కనిపించకపోవడంతో తిరువల్లం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. పలు దఫాలుగా విచారించిన పోలీసులు బిను పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడంతో అతడిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన సోదరుడిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని ఇంటి పెరట్లో వెలికితీశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రోజున అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. అది రాజ్ హత్యతో ముగిసింది. బినుకు మానసిక సమస్యలు ఉన్నట్లు తెలిపారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
మృతదేహాన్ని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం తరలించారు.