Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
T-Congress Is Playing With A Sentiment In Rahul
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని మెదక్ బరిలోకి దించాలని ఎప్పట్నుంచో ఆలోచిస్తున్న టీకాంగ్రెస్ నేతలు.. ఎట్టకేలకు ఆ విషయాన్ని ఆయన చెవిన వేశారు. పైగా నాయనమ్మ ఇందిర గతంలో చేసిన హిస్టారిక్ సీన్ మీరూ రిపీట్ చేయొచ్చని కిర్రెక్కించారు. అటు రాహుల్ కూడా సెంటిమెంట్ ను నమ్ముకోవాలని డిసైడయ్యారు. తాను రంగంలోకి దిగితే తెలంగాణలో పార్టీ గెలుపు అవకాశాలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
గతంలో 1980లో ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా తొమ్మిది లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిపైనే ఆమె ఇంత ఆధిక్యత సాధించారు. అప్పుడు అంతా బాగానే ఉన్నా.. ఇప్పటి పరిస్థితి మాత్రం అంత అనుకూలంగా లేదు. అయినా సరే కలిసికట్టుగా శ్రమిస్తే రాహుల్ కు భారీ మెజార్టీ వస్తుందని టీకాంగ్రెస్ ఢంకా బజాయిస్తోంది.
తెలంగాణలో కూడా అధికారం కోసం శ్రమిస్తున్న కాంగ్రెస్ రాహుల్ ను తురుపుముక్కగా వాడాలని డిసైడైంది. ఇందుకోసం మెదక్ ఎంపీ స్థానంతో పాటు తెలంగాణలో పొలిటికల్ పిక్చర్ పై రాహుల్ కు పలుమార్లు ప్రజెంటేషన్లు ఇచ్చింది. రాహుల్ కూడా సొంత సర్వేల్లో ఇదే తేల్చుకున్నారట. అందుకే తెలంగాణలో బరిలోకి దిగి తాను గెలవడంతో పాటు పార్టీని గెలిపించి ఐరన్ లెగ్ ముద్ర చెరిపేసుకోవాలని అనుకుంటున్నారు.