2.ఓ ను మించి భారీ సినిమాకు ఏర్పాట్లు

Tamil Director Shankar Plans A Hrithik Roshan In New Movie

తమిళ స్టార్ డైరక్టర్ శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో ఇటివల వచ్చిన సైంటిఫిక్ చిత్రం 2.ఓ. తెలుగు, తమిళ, హింది బాషలో ఈ చిత్రాని రూపొందించారు. ఈ చిత్రం విడుదలై మంచి విజయాని సొంతం చేసుకుంది. శంకర్ మరల ఇదే తరహాలో సూపర్ మాన్ కాన్సెప్ట్ తో మరో కొత్త ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తునట్లు సమాచారం. అందుకోసం బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా హృతిక్ నుండి ఏలాంటి సమాచారం లేదు. త్వరలోనే ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ రానున్నది. అంటే త్వరలో ఇండియాలోకూడా సూపర్ మాన్, బ్యాట్ మాన్, స్పైడర్ మాన్ తరహా కథలకు శంకర్ నాంది వేస్తున్నాడు.

ఇండియన్ సినిమా కూడా మరో సరికొత్త సూపర్ మాన్ తరహా అంకం ప్రారంభం కానున్నది. శంకర్, లోకనాయకుడు కమల్ హసన్ కాంబినేషన్ లో అపట్లో వచ్చిన భారతీయుడు చిత్రం మంచి విజయాని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాని శంకర్ రీమేక్ చేసేపనిలో ఉన్నాడు. అందుకు సంబందించిన పనులు కూడా మొదలు పెట్టేశాడు. ఈ నెల 18 నుండి పొల్లాచిలో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానున్నది. అందుకు సంబందించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆ తరువాత షెడ్యూల్ ను ఉక్రెయిన్ లో జరుపుతారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయకగా నటిస్తుంది. ముఖ్య పాత్రలో దుల్కర్ సల్మాన్, శింభు నటిస్తున్నారు. లైక ప్రొడక్షన్స్ వారు 300కోట్లు తో భారతీయుడు 2 చిత్రాని నిర్మిస్తున్నారు. సంగీతం దిగ్గజం ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారు.