ధనుష్‌కు కోపం వచ్చింది

Tamil-hero-Dhanush-Gets-Ang

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ హీరో ధనుష్‌ తాజా చిత్రం ‘వీఐపీ 2’. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తెలుగులో భారీగా విడుదల చేయనుండటంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు గత మూడు నాలుగు రోజులుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అయిన ధనుష్‌, దర్శకురాలు సౌందర్య, హీరోయిన్‌ కాజోల్‌లు హైదరాబాద్‌లో పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పబ్లిసిటీ కార్యక్రమంలో భాగంగా ధనుష్‌ టీవీ9కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ధనుష్‌ సినిమాకు సంబంధించిన పలు విషయాలను చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఆయన వ్యక్తిగత విషయాలను గురించి యాంకర్‌ దీప్తి కొన్ని ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలకు కోపంతో ఊగిపోయిన ధనుష్‌ మైక్‌ను తీసి పడేసి అక్కడ నుండి వెళ్లి పోయాడు.

ఇంతకు ఇంటర్వ్యూలో దీప్తి ఏమడిగిందంటే.. సుచిలీక్స్‌ వ్యవహారంలో మీ ఫొటోలు మరియు వీడియోలు లీక్‌ అయ్యాయి కదా, ఆ విషయం వల్ల మీ ఫ్యామిలీలో ఏమైనా విభేదాలు వచ్చాయా అంటూ ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు ధనుష్‌ ఒక్కసారిగా వైల్డ్‌ రియాక్ట్‌ అయ్యాడు. ‘దిస్‌ ఈజ్‌ రియల్లీ స్టుపిడ్‌’ అంటూ మైక్‌ను విసిరేసి అక్కడ నుండి వెళ్లి పోయాడు. ఆ ప్రశ్నకు దనుష్‌కు అంత కోపం రావాల్సిన అవసరం లేదు. ఆ విషయం గురించి మాట్లాడను అని తేల్చి చెబితే అయిపోయేది. దాన్ని ఎడిటింగ్‌లో తీసేసేవారు. కాని ఆ ప్రశ్న వేయడమే ఆలస్యం వెంటనే అలా వెళ్లిపోవడంతో సందు దొరికింది కదా అని టీవీ9 రచ్చ రచ్చ చేస్తోంది.

మరిన్ని వార్తలు:

దొంగల పారిపోయిన నవదీప్‌!!

మేడం మీకు అంత సీన్‌ లేదు

ఛార్మికి ఎందుకు అంత నొప్పి?