హెరిటేజ్ కి అగ్నిపరీక్ష?

rajendra balaji sent heritage milk samples to pune research lab

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అసలే వేడివేడిగా సాగుతున్న తమిళ రాజకీయాల్లో ఇదో పిట్టకథ. పళనిస్వామి ప్రభుత్వం ఉంటుందో… ఊడుతుందో అర్ధం గాక రాజకీయ నేతలంతా లెక్కల్లో మునిగితేలుతుంటే ఆయన సర్కార్ లో ఓ మంత్రి మాత్రం ప్రయివేట్ పాల డైరీల్ని టార్గెట్ చేసి బోల్తా పడ్డాడు. తమిళనాడు పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజేంద్రన్ బాలాజీ. ఎదురుగా జనం, చేతిలో మైకు ఉంటే చాలు పర్యవసానాలు పెద్దగా లెక్క చేయకుండా మాట్లాడేస్తుంటారు. ఈ మధ్య అలాగే ప్రైవేట్ డైరీ ల నుంచి వస్తున్న పాలన్నీ రసాయనాలతో నిండిపోయాయని చెప్పారు. అవి తాగితే అనారోగ్యం పాలు అవుతామని జనాన్ని హడలెత్తించారు. దీంతో తమిళనాడు మార్కెట్ లో భారీ ఎత్తున సరఫరా అవుతున్న హేరిటేజ్ పాల నాణ్యత మీద కూడా డౌట్ వచ్చింది. దాన్ని తీర్చడానికి బ్రాహ్మణి స్వయంగా చెన్నై వెళ్లారు. అక్కడ తమ తనయుడు దేవాన్ష్, మామ చంద్రబాబు సైతం హేరిటేజ్ పాలు తాగుతారని వివరించారు. అందులో ఏ కల్తీ లేదని వివరణ ఇచ్చారు.

బ్రాహ్మణి వివరణతో మంత్రి బాలాజీ సంతృప్తి చెందలేదు. పాల నాణ్యత మీద పరీక్షలు జరిపించారు. పూణే లాబరేటరీ కి వివిధ ప్రైవేట్ డైరీ ల పాల సాంపిల్స్ పంపారు. అక్కడ పరీక్షల అనంతరం హేరిటేజ్ పాలలో ఏ రసాయనాలు కలవలేదని పూణే పరిశోధన కేంద్రం నివేదిక ఇచ్చింది. దీంతో సదరు ఆరోపణలు చేసిన బాలాజీ పరిస్థితి బోల్తా పడ్డట్టు అయ్యింది. కింద పడినా పైచేయి నాదే అన్నట్టుగా ఇప్పుడు పాలలో ప్రమాదకర రసాయనాలు లేవని మాత్రమే తెలిసింది కానీ అందులో ఏ కల్తీ లేదని చెప్పలేదుగా అని మంత్రిగారు అంటున్నారు. అంటే హేరిటేజ్ కి ఇంకో రూపంలో అగ్నిపరీక్ష తప్పదన్నమాట.

మరిన్నివార్తలు 

రెడ్డి మీదకి రెడ్డిని వదులుతున్న రెడ్డి.

ఔననక పోయినా కాదనడం లేదట…రజని మార్క్ డైలాగు.