బాలీవుడ్లో గత రెండు రోజులుగా తనూశ్రీ దత్తా వ్యవహారం హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తెల్సిందే. జాతీయ అవార్డు గ్రహీత అయిన నానా పటేకర్‌పై ఈమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. నానా పటేకర్ తనను లైంగికంగా వేదించాడు అంటూ వ్యాఖ్యలు చేసిన తనూ శ్రీదత్త తన వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మరో బాలీవుడ్ స్టార్‌పై తన విమర్శల బాణం వదిలి ఆందోళన కలిగిస్తుంది. ముందు ముందు మరెందరిపై ఈమె బాంఋ వదులుతుందో అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
పది సంవత్సరాల క్రితం బాలీవుడ్లో తాను నటించిన ఒక సినిమా షూటింగ్ సందర్బంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి నన్ను డ్రస్ విప్పి మరీ డాన్స్ వేయించేందుకు ప్రయత్నించాడు. డ్రస్ విప్పి డాన్స్ వేస్తేనే నీకు ఈ సినిమాలో ఛాన్స్ లేదంటే వెళ్లాల్సిందే అంటూ ఆయన చెప్పడంతో నేను షాక్ అయ్యాను. నేను ఆలోచించే సమయంలో అక్కడే ఉన్న సునీల్ శెట్టి మరియు ఇర్ఫాన్ ఖాన్లు అడ్డుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో తనపై జరిగిన లైంగిక దాడుల గురించి ఈమద్య వరుసగా చెబుతూ వస్తుంది. తర్వాత ఈమె లిస్ట్‌లో ఎవరు ఉన్నారో అంటూ బాలీవుడ్ వర్గాల వారు ఎదురు చూస్తున్నారు. అయితే తనూశ్రీ దత్తా చేస్తున్న ఆరోపణలు అన్ని కూడా అబద్దాలే అంటూ కొందరు ఆమెను విమర్శిస్తుంటే మరి కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.