Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశంలో మొదటి విమాన సంస్థ పెట్టిన ఘనత టాటాల సొంతం. స్వాతంత్ర్యం రాకముందే సొంత ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా నడిపిన టాటాలు… నెహ్రూ కోరడంతో కాదనలకే… తమ ఎయిర్ లైన్స్ భారత్ సర్కారుకు ఇచ్చేశారు. కానీ బాగా నడుస్తున్న ఎయిర్ లైన్స్, ఎంతో పేరు న్న సంస్థను తీసుకున్న కేంద్రం… మాత్రం నిర్వహణలో ఘోరంగా విఫలమై… సంస్థ విలువన దిగజార్చింది.
ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు కలిసి మహారాజా పరిస్థితి తీసికట్టుగా చేశారనేది అందరికీ తెలిసిన విషయం. ఎయిరిండియాను ఆ సంస్థ ఉన్నతాధికారుల సలహాల ప్రకారం నడిపి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేది. కానీ మనదే కదా సంస్థ… వాడేద్దాం అన్నట్లు వ్యవహరించడంతో… ఎయిరిండియా ఇప్పుడు 50వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయింది. ప్రభుత్వ విధానాలే దీనికి కారణమని భావిస్తున్న టాటాలు… తమ ఎయిర్ లైన్స్ తమకు అమ్మితే రెడీ అని ముందుకొచ్చారట.
ఎప్పట్నుంచో ఎయిర్ ఇండియా అమ్మాలని చూస్తున్న కేంద్రానికి ఈ అవకాశం మంచిదనిపించింది. వెంటనే టాటాలతో చర్చలు మొదలుపెట్టిందట. టాటాలు సింగపూర్ ఎయిర్ లైన్స్ తో కలిసి ప్రభుత్వ వాటా కొంటామని అడుగుతున్నారు. త్వరలో డీల్ కుదిరే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం దగ్గర కంటే టాటాల దగ్గరే ఎయిరిండియా బాగా రాణిస్తుందని మార్కెట్ కూడా నమ్ముతుండటం విశేషం.