Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కానీ నంద్యాల ఉపఎన్నిక తర్వాత ఆమె జోరు తగ్గింది. మీడియాకు కనిపించడం మానేశారు. అయినా సరే ఇదే అదనుగా రోజాను దెబ్బకొట్టాలని టీడీపీ డిసైడైపోయింది. వచ్చే ఎన్నికల్లో రోజాకు పోటీగా వాణి విశ్వనాథ్ ను దించాలని డిసైడైన టీడీపీ.. ఆలోగా రోజా ప్రెస్ మీట్లకు కౌంటర్ ఇవ్వడానికి సుధారాణిని రెడీ చేసింది. గతంలో టీడీపీ నేతగా ఉన్న వెళ్లారు.
ఆ తర్వాత పీఆర్పీ మూసేయడంతో.. అప్పట్నుంచి పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు. అసలు ఆమె మళ్లీ టీడీపీలోకి ఎప్పుడొచ్చారో కూడా చాలా మందికి తెలీదు. అలాంటి శోభారాణిని రోజాకు పోటీగా దించితే.. ఆమె నోటికి ఆటోమేటిగ్గా తాళం పడుతుందని టీడీపీ భావిస్తోంది. గతంలో ఇద్దరూ బద్ధశత్రువులే కాబట్టి.. ఇప్పుడూ పోటీ బాగుంటుందనేది అధిష్ఠానం ఆలోచన. రోజాపై ప్రస్తుతం అనితను ప్రయోగిస్తున్నా.. ఆమె శక్తి చాలడం లేదని అనుకుంటున్నారు. శోభారాణిని కూడా దించితే కానీ రోజా నోరు మూతపడదని చెబుతున్నారు. నంద్యాల ఎన్నికల ఓటమితో డిఫెన్స్ లో పడ్డ రోజాను దెబ్బకొట్టడానికి ఇదే సరైన అవకాశమని టీడీపీ భావిస్తోంది. ఓవైపు రోజా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తూనే.. మరోవైపు ఆమె ప్రెస్ మీట్లకు చెక్ పెట్టి.. వచ్చే ఎన్నికల నాటికి ఆమెను క్రమంగా బలహీనపరచాలని టీడీపీ చూస్తోంది.
మరిన్ని వార్తలు: